Breaking News

CM Revanth met with Mallikarjuna Kharge

మల్లికార్జున ఖర్గేతో సీఎం రేవంత్ భేటీ

మల్లికార్జున ఖర్గేతో సీఎం రేవంత్ భేటీ – కీలక అంశాలపై చర్చ

హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో భాగంగా ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే (Mallikarjun Kharge)తో సమావేశమయ్యారు. ఈ భేటీలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ పాల్గొన్నారు.

పీసీసీ కార్యవర్గం, ఎస్సీ వర్గీకరణ, కుల గణనపై చర్చ

ఈ సందర్భంగా తెలంగాణ పీసీసీ (TPCC) కొత్త కార్యవర్గంతో పాటు పలు కీలక అంశాలపై చర్చ జరిగింది. ముఖ్యంగా ఎస్సీ వర్గీకరణ, కుల గణన (Caste Census) అంశాలు ప్రధాన చర్చనీయాంశాలుగా నిలిచాయి.

నీట్ పరీక్ష నిర్వహణలో వైఫల్యం: సిపిఐ తీవ్ర విమర్శలు

“తెలంగాణలో ఎస్సీ వర్గీకరణ అమలు చేయనున్నాం”

తెలంగాణలో ఎస్సీ వర్గీకరణను అమలు చేయాలని నిర్ణయించామని సీఎం రేవంత్ ఖర్గేకు తెలిపారు. ఈ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.

రాహుల్ గాంధీకి ఆహ్వానం – సూర్యాపేట, గజ్వేల్ సభలు

  • బీసీ కుల గణన (Caste Census)పై అవగాహన కల్పించేందుకు సూర్యాపేటలో రాహుల్ గాంధీ పాల్గొనే భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.
  • ఏప్రిల్‌లో ఎస్సీ వర్గీకరణపై గజ్వేల్‌లో మరో భారీ సభ నిర్వహించనున్నామని, ఈ సభకు హాజరుకావాలని ఖర్గేని సీఎం రేవంత్ కోరారు.

త్వరలో కీలక నిర్ణయాలు

ఈ భేటీ అనంతరం కాంగ్రెస్ హైకమాండ్ నుంచి తెలంగాణలో ఎస్సీ వర్గీకరణ, బీసీ కుల గణన, పీసీసీ పదవుల కేటాయింపుపై త్వరలోనే కీలక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.

అక్రమాల ఆరోపణలతో నీట్ యూజీ 2026 పరీక్ష రద్దు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *