Breaking News

"Not enough time to talk about Tinmar Mallanna"

“తీన్మార్ మల్లన్నపై మాట్లాడేంత టైమ్ లేదు”

“తీన్మార్ మల్లన్నపై మాట్లాడేంత టైమ్ లేదు” – మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

యాదాద్రి భువనగిరి: ఆర్అండ్‌బీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పర్యటనలో భాగంగా టీపీసీసీ కార్యదర్శి పొత్నక్ ప్రమోద్ కుమార్ సతీమణి రోజా చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య కూడా పాల్గొన్నారు.

“తీన్మార్ మల్లన్నపై మాట్లాడం వేస్ట్”

ఈ సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి మాట్లాడుతూ, తీన్మార్ మల్లన్న అంశంపై మాట్లాడేంత టైమ్ తనకు లేదని, అతని గురించి మాట్లాడటం కూడా అవసరం లేదని అన్నారు. “టీపీసీసీ, ఏఐసీసీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ చిన్నారెడ్డి తీన్మార్ మల్లన్నకు నోటీసులు జారీ చేశారని పత్రికల్లో చదివాను” అని చెప్పారు.

తల్లిదండ్రుల సంరక్షణపై కఠిన చట్టం.. నిర్లక్ష్యానికి ఇక గట్టి హెచ్చరిక: సీఎం ఎ. రేవంత్ రెడ్డి

“కులగణనలో 56.6% బీసీలు”

“తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహించిన కుల గణనలో బీసీ జనాభా 56.6%గా నిర్ధారణ అయింది” అని కోమటిరెడ్డి తెలిపారు. “బడుగు, బలహీన వర్గాలను అన్ని రంగాల్లో ముందుకు తీసుకురావడమే మా ప్రభుత్వ లక్ష్యం” అని స్పష్టం చేశారు.

“42% రిజర్వేషన్ – వర్గీకరణలో వెనకడుగు లేదు”

  • “స్థానిక సంస్థల ఎన్నికల్లో ఖచ్చితంగా 42% రిజర్వేషన్లు అమలు చేస్తాం” అని తెలిపారు.
  • “ఎస్సీ వర్గీకరణ విషయంలో వెనకడుగు వేయే ప్రసక్తే లేదు” అని స్పష్టం చేశారు.

“తెలంగాణ భూస్వాముల కోసం రాలేదు”

  • “90% ప్రజల హక్కుల కోసం తెలంగాణ ఏర్పడింది, భూస్వాములు, ఫామ్‌హౌస్‌లలో ఉండేవారికి తెలంగాణ అవసరం కాదు” అని మంత్రి కోమటిరెడ్డి విమర్శించారు.
  • “ఫామ్ హౌస్‌ల్లో ఉంటూ కులగణన సర్వేలో పాల్గొనకుండా మౌనం పాటించే వారికి మాట్లాడే హక్కు లేదు” అని బీఆర్ఎస్ నేతలపై విమర్శలు గుప్పించారు.
  • “మేము హడావిడి సర్వే చేయలేదని, ప్రజల ముందే పూర్తి నివేదిక ఉంచామని” కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు.

తల్లిదండ్రులను పట్టించుకోకపోతే జీతం కట్.. తెలంగాణలో కొత్త చట్టం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *