Breaking News

MP Raghunandan Rao's reaction on Delhi results

ఢిల్లీ ఫలితాలపై ఎంపీ రఘునందన్ రావు స్పందన

ఢిల్లీ ఫలితాలపై ఎంపీ రఘునందన్ రావు స్పందన

ఈ సందర్భంగా తెలంగాణ బీజేపీ ఎంపీ రఘునందన్ రావు (MP Raghunandan Rao) స్పందిస్తూ,

“కర్ణుడి చావుకు వంద కారణాలు ఉన్నట్లుగా, హస్తినలో బీజేపీ విజయం సాధించడానికి వంద కారణాలు ఉన్నాయి” అని వ్యాఖ్యానించారు.

తల్లిదండ్రుల సంరక్షణపై కఠిన చట్టం.. నిర్లక్ష్యానికి ఇక గట్టి హెచ్చరిక: సీఎం ఎ. రేవంత్ రెడ్డి
  • ఆమ్ ఆద్మీ పార్టీ అవినీతికి పాల్పడిందని ఆరోపణలు చేశారు.
  • “అవినీతికి వ్యతిరేకంగా పుట్టామని చెప్పుకున్న ఆప్, 12 ఏళ్ల పాలనలో స్కాంలకు కేంద్ర బిందువైంది. సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రులపై స్కాంల ఆరోపణలు రావడం ఓటమికి కారణం” అని చెప్పారు.
  • “పేదలు, బడుగు, బలహీన వర్గాలు, మధ్య తరగతి ప్రజలు బీజేపీకి అండగా నిలవడంతో ఈ ఘన విజయాన్ని సాధించాం” అని అన్నారు.
  • కేంద్ర ప్రభుత్వ పథకాలను నిర్లక్ష్యం చేసినందునే ఢిల్లీ ప్రజలు ఆప్‌కు గుణపాఠం చెప్పారని విమర్శించారు.

తెలంగాణలోనూ గులాబీ పార్టీ గల్లంతు ఖాయం

రఘునందన్ రావు తెలంగాణ పరిస్థితిపై కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు.

  • “ఢిల్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ గాడిద గుడ్డు కొట్టుకుంది. తెలంగాణలో రానున్న సార్వత్రిక ఎన్నికల్లో బీఆర్ఎస్ (BRS)కు కూడా అదే గతి పడుతుంది” అని సెటైర్లు వేశారు*.
  • “ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడినా ఇప్పటి వరకు అభ్యర్థులను ఖరారు చేయలేకపోవడం బీఆర్ఎస్ బలహీనతను సూచిస్తోంది” అని అన్నారు.

తల్లిదండ్రులను పట్టించుకోకపోతే జీతం కట్.. తెలంగాణలో కొత్త చట్టం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *