మహా కుంభమేళకు 13 వేల రైళ్లు సిద్ధం
డిసెంబర్ 9, 2024:
ప్రయాగరాజ్‌లో వచ్చే ఏడాది జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26 వరకు జరగనున్న మహా కుంభమేళా కోసం రైల్వే శాఖ భారీ ఏర్పాట్లు చేపట్టింది. యాత్రికులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా మొత్తం 13 వేల రైళ్లను నడపనున్నట్లు రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు.
ఈ మేరకు 3 వేల ప్రత్యేక రైళ్లను కూడా అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు ప్రకటించారు. దాదాపు 2 కోట్ల మంది భక్తులు రైళ్ల ద్వారా కుంభమేళాకు చేరుకునే అవకాశం ఉండటంతో, రైల్వే శాఖ పకడ్బందీ ఏర్పాట్లు చేస్తోంది. కుంభమేళా సందర్భంగా రద్దీని దృష్టిలో ఉంచుకుని ప్రత్యేక రైల్వే సర్వీసులు, భద్రతా ఏర్పాట్లపై ప్రత్యేక శ్రద్ధ పెట్టినట్లు మంత్రి తెలిపారు.
భక్తుల రాకపోకల సౌలభ్యం కోసం ప్లాట్‌ఫారాల సంఖ్యను పెంచడం, అదనపు సిబ్బందిని నియమించడం వంటి చర్యలు చేపట్టనున్నట్లు సమాచారం.