హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు భారీగా పెరుగుదల
హైదరాబాద్, డిసెంబర్ 10:
హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి.
- 22 క్యారెట్ల బంగారం: 10 గ్రాముల ధర రూ.750 పెరిగి ₹72,050కు చేరింది.
- 24 క్యారెట్ల బంగారం: 10 గ్రాముల ధర రూ.820 పెరిగి ₹78,600కు చేరింది.
- వెండి ధర: కిలోకు ఏకంగా రూ.4,000 పెరిగి ₹1,04,000కి చేరుకుంది.
గత 10 రోజులలో ఈ స్థాయిలో బంగారం, వెండి ధరలు పెరగడం ఇదే తొలిసారి. తెలుగు రాష్ట్రాల్లోని హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం వంటి ప్రధాన నగరాల్లో దాదాపు ఇదే ధరలు నమోదవుతున్నాయి.
ధరల పెరుగుదల కారణాలు:
ప్రపంచ బులియన్ మార్కెట్‌లో వెలువడుతున్న అనిశ్చితి, ఆర్థిక మాంద్యం భయాలు, పెట్టుబడిదారుల ఆసక్తి పెరుగుదల వంటి అంశాలు ధరల పెరుగుదలకు కారణమని నిపుణులు పేర్కొంటున్నారు.
దీనితో బంగారం, వెండి కొనుగోలు చేసే వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు.