వచ్చే ఏడాది టీచర్ పోస్టుల భర్తీ: సీఎం చంద్రబాబు
అమరావతి:
ఆంధ్రప్రదేశ్ దేశంలో అత్యధిక పింఛన్ అందించే రాష్ట్రంగా ఉన్నట్లు సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. ‘మనం అందిస్తున్న పింఛన్‌కు ఇతర రాష్ట్రాల్లో సగం కూడా ఇవ్వడం లేదు’ అని పేర్కొన్నారు.
- వచ్చే ఏడాది స్కూళ్లు ప్రారంభమయ్యే సమయానికి టీచర్ పోస్టుల భర్తీ పూర్తవుతుందని ఆయన ప్రకటించారు.
- దీపం-2 పథకం కింద ఇప్పటికే 40 లక్షల మందికి ఉచిత గ్యాస్ సిలిండర్లు పంపిణీ చేసినట్లు తెలిపారు.
- సంక్రాంతి నాటికి రాష్ట్రంలోని ఆర్ అండ్ బీ రోడ్లపై ఎక్కడా గుంతలు లేకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ల సదస్సులో అధికారులను ఆదేశించారు.