Breaking News

భార్యతో మాట్లాడాడన్న అనుమానం.. స్నేహితుడిని హత్య చేసిన వ్యక్తి

హైదరాబాద్‌, మార్చి 29, నేటి తెలుగు పత్రిక: హైదరాబాద్‌లోని చాంద్రాయణగుట్ట పరిధిలో దారుణ ఘటన చోటుచేసుకుంది. భార్యతో మాట్లాడాడన్న అనుమానంతో ఓ వ్యక్తి తన స్నేహితుడిని దారుణంగా హత్య చేసిన ఘటన కలకలం రేపింది.పోలీసుల వివరాల ప్రకారం, ప్లంబర్‌గా పనిచేస్తున్న సల్మాన్ (23)పై నిందితుడు అబ్దుల్లా కక్ష పెంచుకున్నాడు. తన భార్యతో సల్మాన్ ఫ్రెండ్లీగా మాట్లాడుతున్నాడని అనుమానించిన అబ్దుల్లా, కొంతకాలంగా అతనిపై కోపంతో ఉన్నాడు.ఈ నెల 23న రాత్రి, అబ్దుల్లా తన స్నేహితులతో కలిసి ప్లాన్ ప్రకారం సల్మాన్‌ను అడ్డగించి గొడవకు దిగాడు. అనంతరం పదునైన ఆయుధాలతో దాడి చేయడంతో సల్మాన్ తీవ్రంగా గాయపడ్డాడు. అక్కడి నుంచి అతన్ని ఉస్మానియా జనరల్ ఆసుపత్రికు తరలించారు.అయితే చికిత్స పొందుతూ సల్మాన్ మృతి చెందాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు అబ్దుల్లాతో పాటు అతని స్నేహితులను అరెస్ట్ చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.చిన్న అనుమానం ప్రాణాలు తీసిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర ఆందోళన కలిగించింది.

ఢిల్లీలో ఘోర ప్రమాదం సాకేత్ సమీపంలో కుప్పకూలిన ఐదంతస్తుల భవనం.. శిథిలాల కింద పలువురు

బాల్క సుమన్‌కు 14 రోజుల రిమాండ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *