Breaking News

స్వీడన్ అత్యున్నత గౌరవం అందుకున్న ప్రధాని మోదీ

మే 18, (నేటి తెలుగు పత్రిక): ప్రధాని నరేంద్ర మోదీకి మరో అరుదైన అంతర్జాతీయ గౌరవం లభించింది. స్వీడన్ ప్రభుత్వం విదేశీ ప్రముఖులకు ప్రదానం చేసే అత్యున్నత పురస్కారాల్లో ఒకటైన ‘రాయల్ ఆర్డర్ ఆఫ్ ది పోలార్ స్టార్ కమాండర్ గ్రాండ్ క్రాస్’ అవార్డును ప్రధాని మోదీకి ప్రకటించింది. ఈ గౌరవం లభించడంతో దేశవ్యాప్తంగా హర్షం వ్యక్తమవుతోంది.ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రధాని మోదీకి అభినందనలు తెలిపారు. సోషల్ మీడియా వేదికగా స్పందించిన ఆయన.. మోదీ నాయకత్వానికి ప్రపంచ స్థాయిలో లభిస్తున్న గుర్తింపే ఈ పురస్కారమని పేర్కొన్నారు. అంతర్జాతీయ వేదికపై భారత ప్రతిష్ఠను పెంచడంలో ప్రధాని కీలక పాత్ర పోషిస్తున్నారని కొనియాడారు.ప్రపంచ దేశాలతో వ్యూహాత్మక, ఆర్థిక, సాంకేతిక, రక్షణ రంగ సంబంధాలను బలోపేతం చేయడంలో మోదీ విశేష కృషి చేస్తున్నారని చంద్రబాబు తెలిపారు. ఆయన దౌత్యపరమైన చాతుర్యంతో భారత్ గ్లోబల్ స్థాయిలో మరింత ప్రభావవంతమైన దేశంగా ఎదుగుతోందన్నారు.‘రాయల్ ఆర్డర్ ఆఫ్ ది పోలార్ స్టార్ కమాండర్ గ్రాండ్ క్రాస్’ పురస్కారం స్వీడన్ అందించే అత్యంత ప్రతిష్ఠాత్మక గౌరవాల్లో ఒకటిగా గుర్తింపు పొందింది. విదేశీ నేతలు ప్రపంచ దేశాలతో సంబంధాలను బలోపేతం చేయడంలో చేసిన సేవలకు గుర్తింపుగా ఈ అవార్డును అందజేస్తారు.మోదీ తన రాజకీయ జీవితంలో అందుకున్న 31వ అంతర్జాతీయ పురస్కారం ఇదేనని చంద్రబాబు వెల్లడించారు. ప్రపంచవ్యాప్తంగా భారతదేశానికి పెరుగుతున్న గౌరవానికి ఇది నిదర్శనమని అభిప్రాయపడ్డారు.ఇటీవల జీ20 సమావేశాలు, ద్వైపాక్షిక పర్యటనలు, అంతర్జాతీయ వేదికల ద్వారా భారత్‌ను ప్రపంచ ఆర్థిక, రాజకీయ వ్యవస్థలో కీలక శక్తిగా నిలబెట్టేందుకు ప్రధాని మోదీ కృషి చేస్తున్నారని విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఈ క్రమంలో వరుసగా అంతర్జాతీయ గౌరవాలు దక్కుతున్నాయని తెలిపారు.ప్రధాని మోదీకి లభించిన ఈ గౌరవంపై బీజేపీ నేతలు, మిత్రపక్షాలు, అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

హోర్ముజ్‌లో ఇంటర్నెట్ కేబుల్స్‌పైనా టోల్?.. ఇరాన్ కొత్త ప్రతిపాదన

ఎబోలా కలకలం.. ప్రపంచవ్యాప్తంగా అప్రమత్తం చేసిన డబ్ల్యూహెచ్‌వో

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *