102ఏళ్ల బామ్మను పెళ్లి చేసుకున్న 100 ఏళ్ల వృద్ధుడు!
డిసెంబర్ 08, 2024
అమెరికాలో ఓ అద్భుతమైన ప్రేమకథ గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం పొందింది. 102 ఏళ్ల వృద్ధురాలితో 100 ఏళ్ల వృద్ధుడు చేసిన లవ్ మ్యారేజ్ ఈ రికార్డుకు దారితీసింది. వారి వయస్సు కలిపితే 202 సంవత్సరాలు, 271 రోజులు అని లండన్‌లోని గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ సంస్థ వెల్లడించింది.
ఈ జంట పదేళ్ల పాటు ప్రేమలో ఉండి, చివరకు 2024 మే 3న వివాహం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఈ జంటను ప్రపంచవ్యాప్తంగా ఉన్న జనాలు అభినందిస్తున్నారు. “ఓల్డెస్ట్ న్యూ కపుల్”గా వారు గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు సంపాదించడం విశేషం.