|| Heavy financial assistance from Center to flood affected states ||
న్యూఢిల్లీ: 2024లో వరదలు, ఆకస్మిక వరదలు, కొండచరియలు విరిగిపడటం, తుఫాన్ల కారణంగా తీవ్రంగా ప్రభావితమైన ఐదు రాష్ట్రాలకు నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్ (NDRF) కింద రూ.1,554.99 కోట్లు అదనపు సహాయంగా అందించేందుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది.
బుధవారం కేంద్ర హోంమంత్రి అమిత్ షా (Amit Shah) నేతృత్వంలో జరిగిన ఉన్నత స్థాయి కమిటీ సమావేశంలో ఈ నిధుల మంజూరుకు గ్రీన్ సిగ్నల్ లభించింది.
ఏ రాష్ట్రానికి ఎంత నిధులు?
✅ ఆంధ్రప్రదేశ్ – ₹ 608.08 కోట్లు
✅ నాగాలాండ్ – ₹ 170.99 కోట్లు
✅ ఒడిశా – ₹ 255.24 కోట్లు
✅ తెలంగాణ – ₹ 231.75 కోట్లు
✅ త్రిపుర – ₹ 288.93 కోట్లు
ఈ నిధులను వరదల వల్ల భారీగా నష్టపోయిన ప్రాంతాల్లో పునరుద్ధరణ పనుల కోసం వినియోగించనున్నారు. కేంద్రం ప్రకటించిన ఈ సహాయంతో ప్రభావిత రాష్ట్రాల్లో సహాయ, పునరావాస కార్యక్రమాలు వేగవంతం కానున్నాయి. 🚨💰
