రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దగ్ధం
కోదాడ ,ఫిబ్రవరి 1(నేటి తెలుగు పత్రిక): కేసీఆర్ కి సిట్ నోటీసులు అందజేయడాన్ని నిరసిస్తూ, ప్రభుత్వ వైఖరిని ఖండిస్తూ బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ కేటీఆర్ పిలుపు మేరకు నేడు కోదాడలో మాజీ శాసనసభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్ ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దగ్ధం చేశారు.
ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ…
కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక ప్రతిపక్షమైన బీఆర్ఎస్ పార్టీని ఎదుర్కోలేక వ్యవస్థలను పూర్తిగా దుర్వినియోగం చేస్తూ బీఆర్ఎస్ పార్టీ నాయకులపై కేసులు పెడుతూ పైశాశిక ఆనందం పొందుతున్నారని ఇది ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టు లాంటిదని అన్నారు.తెలంగాణ రాష్ట్ర సాధకుడు, తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ని వ్యక్తిగతంగా అగౌరవపరచడమే ఏకైక లక్ష్యంగా చేసుకొని రాష్ట్ర ప్రభుత్వం అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ, చట్టాలను సైతం లెక్కచేయకుండా న్యాయవ్యవస్థను కించపరుస్తూ సిట్ నోటీసుల పేరుతో దుర్మార్గంగా వ్యవహరిస్తోందని అన్నారు.నాలుగున్నర కోట్ల ప్రజల ఆకాంక్ష అయిన ప్రత్యేక తెలంగాణ రాష్ట్రo కోసం నిర్విరామంగా పోరాటం చేసి రాష్టాన్ని సాధించిన తెలంగాణ జాతిపిత కేసిఆర్ అని అలాంటి కేసీఆర్ ను పట్టుకుని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారని ఇలాంటి వాటిని సమాజం హర్షించదని ఇగ నుంచి అయినా నీ పద్ధతి మార్చుకోకపోతే ప్రజలే గట్టి గుణపాఠం చెప్తారని హెచ్చరించారు.


