ఏపీలో 55 రోజుల్లో రూ.4,677 కోట్ల మద్యం అమ్మకాలు
అమరావతి:
ఆంధ్రప్రదేశ్‌లో లిక్కర్ అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. ఎక్సైజ్ శాఖ తెలిపిన వివరాల ప్రకారం, అక్టోబర్ 16 నుండి డిసెంబర్ 9 వరకు మొత్తం రూ.4,677 కోట్ల విలువైన మద్యం విక్రయాలు జరిగాయి.
ఈ కాలంలో 61.63 లక్షల కేసుల మద్యం, 19.33 లక్షల కేసుల బీర్ అమ్ముడైనట్లు అధికారులు తెలిపారు. రాష్ట్రంలో ప్రైవేట్ వ్యక్తుల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 3,300 లిక్కర్ షాపుల ద్వారా ఈ అమ్మకాలు జరిగాయి. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత మద్యం షాపుల నిర్వహణను ప్రైవేటీకరణ చేసిన సంగతి తెలిసిందే.
మద్యం విక్రయాల రికార్డులను చూసి, రాష్ట్రవ్యాప్తంగా ఇది ఎంత ప్రభావం చూపుతుందనే చర్చ నడుస్తోంది.