గుకేశ్‌కు రూ.5 కోట్ల నజరానా ప్రకటించిన స్టాలిన్
ఫిడే ప్రపంచ చెస్ ఛాంపియన్‌షిప్ టైటిల్ గెలుచుకున్న దొమ్మరాజు గుకేశ్‌ను తమిళనాడు సీఎం స్టాలిన్ ప్రశంసించారు. గుకేశ్ విజయంలో భాగస్వామిగా చెన్నై చెస్ ప్రపంచ రాజధానిగా నిలిచిందని వ్యాఖ్యానించిన ఆయన, గుకేశ్‌కు రూ.5 కోట్ల నగదు బహుమతి ప్రకటించారు.
సింగపూర్‌లో నిర్వహించిన వరల్డ్ చెస్ టోర్నమెంట్‌లో విశ్వవిజేతగా నిలిచిన గుకేశ్ విజయంపై స్టాలిన్ ఫోన్ ద్వారా అభినందనలు తెలిపారు. “గుకేశ్ విజయంతో తమిళనాడు గర్వపడుతోంది. చెన్నై, చెస్ ప్రపంచ రాజధానిగా తన స్థానం మరింత బలపర్చుకుంది,” అని ఆయన పేర్కొన్నారు.
ఈ సందర్భంగా, గుకేశ్ విజయాన్ని తమిళనాడు గేమ్ డెవలప్‌మెంట్‌లో కీలక ఘట్టంగా అభివర్ణించిన స్టాలిన్, ఈ విజయం యువతకు స్ఫూర్తిగా నిలుస్తుందని అన్నారు.
