అల్లు అర్జున్‌కు మధ్యంతర బెయిల్ మంజూరు
హైదరాబాద్:
నాంపల్లి కోర్టు కాసేపటి క్రితం 14 రోజుల రిమాండ్ విధించిన అల్లు అర్జున్‌కు హైకోర్టు ఊరట కల్పించింది. న్యాయమూర్తి, బన్నీ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌పై వాదనలు విన్న తర్వాత, కేసులన్నీ కొట్టివేయలేమని పేర్కొన్నారు. అయితే తాత్కాలికంగా పూచీకత్తుతో మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తామని న్యాయస్థానం పేర్కొంది.
అయితే, రిమాండ్ అనంతరం బన్నీని పోలీసులు ఇప్పటికే చంచలగూడ జైలుకు తరలించారు. హైకోర్టు మధ్యంతర బెయిల్‌పై పరిమిత కాలం పాటు స్వేచ్ఛ పొందేలా అదేశాలు జారీ చేసింది. ఈ పరిణామంతో అల్లు అర్జున్ అభిమానులు కొంత ఊరట పొందారు.