బన్నీకి రాష్ట్ర ప్రభుత్వం రిటర్న్ గిఫ్ట్ ఇచ్చింది: ఆర్జీవీ
హైదరాబాద్, డిసెంబర్ 14:
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ అరెస్ట్‌పై ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ (ఆర్జీవీ) మరోసారి తనదైన శైలిలో స్పందించారు. తెలంగాణకు చెందిన బిగ్గెస్ట్ స్టార్ అల్లు అర్జున్ భారతీయ సినిమా చరిత్రలో భారీ హిట్ సాధించి రాష్ట్రానికి గౌరవాన్ని తెచ్చిపెట్టారని, కానీ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం అతనిని అరెస్ట్ చేస్తూ “రిటర్న్ గిఫ్ట్” ఇచ్చిందని వర్మ తన ట్విట్టర్ ఖాతాలో వ్యాఖ్యానించారు.
“తెలంగాణకు గౌరవాన్ని తీసుకొచ్చిన అల్లు అర్జున్‌కి ఇలాంటి ప్రవర్తన ఏ మేరకు న్యాయమైనది?” అంటూ ఆర్జీవీ ప్రశ్నించారు. ఆయన ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఆర్జీవీ స్పందనతో పాటు ఈ ఘటనపై సినిమా పరిశ్రమలోనూ తీవ్ర చర్చ నడుస్తోంది.