Breaking News

41A Notices to Duvada Srinivas

దువ్వాడ శ్రీనివాస్‌కు 41ఏ నోటీసులు

వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌కు 41ఏ నోటీసులు

శ్రీకాకుళం, డిసెంబర్ 14:
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌కు పోలీసులు 41ఏ నోటీసులు జారీ చేశారు. శ్రీకాకుళం జిల్లా అక్కవరం గ్రామంలో ఉన్న దువ్వాడ శ్రీనివాస్ నివాసానికి పోలీసులు వెళ్లి నోటీసులు అందజేశారు.

హస్తకళాకారులకు ఏడాది పొడవునా ఉపాధే లక్ష్యం: మంత్రి సవిత

జనసేన నాయకుల ఫిర్యాదుల మేరకు టెక్కలి పోలీస్ స్టేషన్‌లో దువ్వాడ శ్రీనివాస్‌పై కేసు నమోదైంది. జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌పై దువ్వాడ శ్రీనివాస్ అనుచిత వ్యాఖ్యలు చేసినట్టు ఫిర్యాదులో పేర్కొన్నారు.

జనసేన పార్టీ నేతలు దువ్వాడ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ, అవి మతసామరస్యాన్ని దెబ్బతీసే విధంగా ఉన్నాయని ఆరోపించారు. దువ్వాడపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది.

ఎన్టీఆర్‌కు సీఎం నినాదాలు.. ‘డ్రాగన్’ గ్లింప్స్‌తో ఫ్యాన్స్ హంగామా

నోటీసులు అందుకున్న దువ్వాడ శ్రీనివాస్ త్వరలో పోలీసుల ముందు హాజరవుతారా? లేదా? అన్న అంశంపై రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఈ వ్యవహారం వైసీపీ, జనసేన పార్టీల మధ్య రాజకీయ ఉద్రిక్తతలను మరింత పెంచుతుందని అనిపిస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *