నెల్లూరుకు అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యం పట్టివేత
|| Arrest of illegally transported ration rice ||
ఏపీలో రేషన్ బియ్యం అక్రమంగా తరలింపు జరుగుతోంది. మైదుకూరు నుంచి నెల్లూరుకు తరలిస్తున్న 600 బస్తాల రేషన్ బియ్యాన్ని అధికారులు సీజ్ చేశారు. పేదలకు అందాల్సిన రేషన్ బియ్యం పక్కదార్లు పడుతుండగా, రెవెన్యూ ఎన్ఫోర్స్‌మెంట్ అధికారులు బద్వేలు వద్ద లారీని అదుపులోకి తీసుకుని, రూ. 15 లక్షల విలువైన బియ్యాన్ని సీజ్ చేశారు. లారీ డ్రైవర్ ఓబులేసును కూడా అదుపులోకి తీసుకున్నారు.