నితీశ్కు ఏసీఏ రూ.25 లక్షల బహుమతి ప్రకటించిన ఏసీఏ అధ్యక్షుడు
విజయవాడ: ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ (ఏసీఏ) తరపున యువ క్రికెటర్ నితీశ్ కుమార్ రెడ్డికి రూ.25 లక్షల నగదు బహుమతిని ప్రకటించారు. ఈ విషయాన్ని ఏసీఏ అధ్యక్షుడు, విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ వెల్లడించారు. ఇండియన్ క్రికెట్ టీమ్‌కు ఎంపికైన నితీశ్కు అభినందనలు తెలియజేస్తూ, ఈ నగదు బహుమతిని త్వరలో ముఖ్యమంత్రి చేతుల మీదుగా అందజేస్తామని తెలిపారు.
నితీశ్ ప్రదర్శనకు ప్రశంసలు
బోర్డర్-గావస్కర్ ట్రోఫీ నాలుగో టెస్టులో ఆల్రౌండర్‌గా నితీశ్ అద్భుతమైన ప్రదర్శన చేసినట్లు కేశినేని శివనాథ్ అన్నారు. ఇలాంటి యువ క్రికెటర్లు నేటి తరం యువతకు ప్రేరణగా నిలుస్తున్నారని, నితీశ్ రోల్ మోడల్‌గా నిలుస్తాడని అభిప్రాయపడ్డారు.
ఆధునిక స్టేడియం నిర్మాణం – ఐపీఎల్ జట్టు లక్ష్యం
రాష్ట్రంలో క్రీడలను మరింత అభివృద్ధి చేసేందుకు ప్రపంచస్థాయి వసతులతో కూడిన స్టేడియాన్ని అమరావతిలో నిర్మించనున్నట్లు చెప్పారు. అలాగే, విశాఖపట్నం స్టేడియంను ఐపీఎల్ మ్యాచ్‌లు నిర్వహించగలిగే విధంగా సవరిస్తున్నామని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కూడా ప్రత్యేక ఐపీఎల్ టీమ్‌ను ఏర్పాటు చేయాలని ఏసీఏ యోచిస్తోందని వెల్లడించారు.
ఈ సందర్భంగా నితీశ్‌కి అభినందనలు తెలుపుతూ, రాష్ట్రం తరపున మరిన్ని విజయాలు సాధించాలనే ఆకాంక్ష వ్యక్తం చేశారు.