నాగబాబు మంత్రి అవుతారనే ప్రచారంపై పవన్ కల్యాణ్ స్పందన
జనసేన ప్రధాన కార్యదర్శి నాగబాబు త్వరలో మంత్రి పదవిని అందుకోబోతున్నారని కొంతకాలంగా ప్రచారం జరుగుతుంది. ఈ విషయంపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పందించారు. నాగబాబు మొదట ఎమ్మెల్సీ అవుతారని ఆయన స్పష్టం చేశారు. “మంత్రి పదవి అనేది తరువాతి దశ” అని పేర్కొన్నారు.
నాగబాబు తన పార్టీ కోసం చేసిన కృషిని గుర్తించి, ఆయనను రాజ్యసభకి పంపాలని భావించారని కానీ అది సాధ్యం కాలేదని పవన్ కల్యాణ్ తెలిపారు. అయితే, ఈ కారణంతో ఎమ్మెల్సీ పదవిని ఇచ్చేందుకు ఆలోచించారని వెల్లడించారు.
గత ఐదు సంవత్సరాలలో వైసీపీ నాయకులతో ఎన్నో వివాదాలు, దూషణలు ఎదుర్కొన్నప్పటికీ నాగబాబు జనసేన కోసం చాలా స్థిరంగా నిలిచినట్లు చెప్పారు.
కందుల దుర్గేశ్ విషయంలో, ఆయన కులం నాకు తెలియదని, కానీ ఆయన పని తీరు నాకు నచ్చడంతోనే మంత్రి పదవి ఇచ్చినట్టు చెప్పారు. పవన్ కల్యాణ్ అన్నారు, రాజకీయాల్లో పనితీరు మాత్రమే ప్రమాణం కావాలని, కులం ప్రకారం పదవులు ఇవ్వడం సరికాదు.
పార్టీకి మద్దతుగా పనిచేసిన నాదెండ్ల మనోహర్ మరియు హరిప్రసాద్ వంటి నాయకులను గుర్తించి, వారి ప్రతిభను సర్‌కొరించి పదవులు ఇచ్చినట్టు పవన్ కల్యాణ్ వివరించారు.