ప్రయాగ్ రాజ్‌లో మహా కుంభమేళా: పుణ్యస్నానం చేసిన ప్రధాని మోదీ
ప్రయాగ్ రాజ్: మహా కుంభమేళా సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ (PM Narendra Modi) బుధవారం ఉదయం పుణ్యస్నానం చేశారు. ఆయనతో పాటు ఉత్తర ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ (CM Yogi Adityanath) కూడా ఉన్నారు.
అరైల్ ఘాట్ నుంచి సంగమం వరకు బోటులో ప్రయాణించిన ప్రధాని, అనంతరం గంగలో పవిత్ర స్నానం చేశారు. భీష్మ అష్టమి రోజున మహా కుంభ మేళాలో పాల్గొనడం విశేషం.
కుంభమేళా విశేషాలు
👉 మహా కుంభమేళా జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26 వరకు జరుగుతోంది.
👉 మంగళవారం భూటాన్ రాజు జిగ్మే ఖేసర్ నాంగ్యల్ వాంగ్‌చుక్ కూడా పుణ్యస్నానం చేశారు.
👉 మహా కుంభమేళా సందర్భంగా ప్రధాని మోదీ ఉత్తర ప్రదేశ్‌లో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొననున్నారు.
తొక్కిసలాట వివాదం:
జనవరి 29న మహా కుంభమేళాలో తొక్కిసలాట ఘటన చోటు చేసుకుంది. అయితే, మరణించిన వారి సంఖ్యను ప్రభుత్వం గోప్యంగా ఉంచిందని విపక్షాలు ఆరోపణలు చేస్తున్నాయి. ఈ ఘటనపై ఫిబ్రవరి 4న పార్లమెంట్‌లో విపక్షాలు ఆందోళన చేపట్టాయి.