Breaking News

Manish Sisodia lost

మనీష్ సిసోడియా ఓటమి

జంగ్పూరాలో మనీష్ సిసోడియాకు భారీ షాక్ – 600 ఓట్ల తేడాతో ఓటమి

న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఊహించని మలుపులు తీసుకుంటున్నాయి. జంగ్పూరా నియోజకవర్గం నుంచి ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) అభ్యర్థి, మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా ఓటమి పాలయ్యారు. భారతీయ జనతా పార్టీ (BJP) అభ్యర్థి తర్వీందర్ సింగ్ 600 ఓట్ల తేడాతో విజయం సాధించారు.

నందిగ్రామ్‌లో కమలం జోరు.. కార్యకర్తలకు ధర్మేంద్ర ప్రధాన్ దిశానిర్దేశం

జైలుకు వెళ్లొచ్చిన సిసోడియాకు ప్రజల నుంచి వచ్చే సానుభూతి గట్టెక్కించలేకపోయింది. ఈ ఓటమితో AAP శ్రేణుల్లో తీవ్ర నిరాశ నెలకొంది.

తమిళ రాజకీయాల్లోకి హీరో విజయ్ ఎంట్రీ.. రెండు చోట్ల పోటీతో హాట్ టాపిక్

27 ఏళ్ల తర్వాత ఢిల్లీలో అధికారంలోకి BJP

  • ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో BJP ఘన విజయం సాధించింది.
  • గత రెండు ఎన్నికల్లో సింగిల్ డిజిట్ సీట్లకు పరిమితమైన కమలం పార్టీ, ఈసారి పూర్తి ఆధిక్యం సాధించింది.
  • 27 ఏళ్ల తర్వాత ఢిల్లీ సింహాసనంపై బీజేపీ కూర్చోనుంది.
  • ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) హ్యాట్రిక్ విజయం సాధించలేకపోయింది, అయితే రెండో అతిపెద్ద పార్టీగా నిలిచింది.

కేజ్రీవాల్ వెనుకంజలో

  • న్యూఢిల్లీ అసెంబ్లీ నియోజకవర్గంలో 9 రౌండ్లు పూర్తయ్యేసరికి
    • AAP అధినేత అరవింద్ కేజ్రీవాల్ 1,170 ఓట్ల వెనుకబడి ఉన్నారు.
    • కేజ్రీవాల్ స్థానంలో BJP అభ్యర్థి స్వల్ప ఆధిక్యంలో కొనసాగుతున్నారు.

కాంగ్రెస్ ఖాతా తీయలేక డీలా

  • ఒక్క అసెంబ్లీ నియోజకవర్గంలో కూడా కాంగ్రెస్ ఆధిక్యంలో లేని పరిస్థితి.
  • గతంలో ఢిల్లీపై తిరుగులేని ఆధిపత్యం కొనసాగించిన కాంగ్రెస్ ఈసారి పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది.

BJP శ్రేణుల్లో సంబరాలు

  • 27 ఏళ్ల నిరీక్షణ తర్వాత అధికారం దక్కడంతో BJP కార్యకర్తలు విజయోత్సవ సంబరాల్లో మునిగిపోయారు.
  • దేశ రాజధానిలో త్రివర్ణ పతాకాలతో BJP మద్దతుదారులు సంబురాలు జరుపుకుంటున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *