మున్నూరు కాపులంటే ఆందోళనలో రాజ్యాధికార నేతలు…..రాష్ట్ర కాపు జేఏసి అధ్యక్షులు——చందు జనార్ధన్
సమాజం లో 18 శాతం ఉన్న సామాజిక వర్గం మున్నూరు కాపులు.అటువంటి సామాజిక వర్గాన్ని సంఖ్య పరంగా దశాబ్దాలుగా తగ్గించు కుంటూ లెక్కల్లో మాయం చేస్తున్నారని రాష్ట్ర కాపు జే ఏ సి అధ్యక్షులు చందు జనార్ధన్ ఆవేదన వ్యక్తం చేశారు.తెలంగాణాలో బీసీ వర్గాల మధ్య భేదాభిప్రాయం తెచ్చి తద్వారా రాజకీయ లబ్ధి పొందాలని రాజ్యాధికారం అనుభవిస్తున్న నేతలు దశాబ్దాలు గా ప్రయత్నాలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.గ్రామాల్లో.మండలాల్లో,డివిజన్ లలో,జిల్లాల్లో అన్ని కేంద్రాల్లో మున్నూరు కాపుల ప్రాధాన్యత,జనాభా దామాషా అందరికి తెలిసిన సత్యం,నిజం అని అన్నారు.ఐక్యత సమైఖ్యత ధ్యేయం గా ముందుకు వెళ్తున్న మున్నూరు కాపులంటే రాజ్యాధికారం అనుభవిస్తున్న వర్గాలు ఎప్పుడు అంతర్గత ఏజండాతో అణచివేసే ప్రక్రియ చేస్తుందని చందు జనార్ధన్ విమర్శించారు.ఉమ్మడిగా రాష్ట్రం ఉన్నప్పటినుండి ప్రజాప్రతినిధులు గా తెలంగాణా ప్రాంతం లో చైతన్య వంతమైన నాయకత్వంతో పెద్దలు పుంజాల శివశంకర్ గారు,బొమ్మ వెంకన్న గారు,డి శ్రీనివాసరావు గారు,వి హనుమంతరావు గారు ప్రస్తుతం జాతీయ రాజకీయాల్లో dr కోవలక్ష్మణ్ గారు బండి సంజయ్ గారు వడ్డిరాజు రవిచంద్ర గారి లాంటి నాయకత్వం కే కేశవరావు గారు ధర్మపురి అరవింద్ గారి తీన్మార్ మల్లన గారి లాంటి నాయకత్వం ఉందని అన్నారు.బీ సీ ల్లో చీలికతెచ్చి తద్వారా రాజకీయ లబ్ధి కోసం కృషి చెయ్యటం రాష్ట్ర అభివృద్ధికి గొడ్డలి పెట్టు.2014,2024 సర్వే లో వైరుధ్యం ప్రజలు రాష్ట్రం దేశం గమనించిందని ఇది సరైన విధానం కాదని అన్నారు.రాష్ట్ర్యముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు జనగణన లో కి రాని మున్నూరుకాపులను,రాని బీసీ గణాంకాలను వచ్చే విధం గా చర్యలు తీసుకోవాలని,కోరారు.
కేంద్ర ప్రభుతం జోక్యం చేసుకోవాలి
తెలంగాణలో జరిగిన జనగణన సర్వేలో తగ్గిన మున్నూరు కాపుల లెక్క
బీసీ ల లెక్కను సరిచేయాలని ఈ విషయం లో కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని రాష్ట్ర కాపు జే ఏ సి అధ్యక్షులు చందు జనార్దన్ డిమాండ్ చేశారు.అధిక శాతం గా ఉన్న మున్నూరు కాపులను అవమానించే విధంగా వింటున్న గణాంకాల విషయం లో కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకొని న్యాయం చేసే విధంగా కేంద్రమంత్రి బండి సంజయ్,కేంద్ర నాయకులు dr లక్ష్మణ్ కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు
కుల గణన ఫలితాలు – జరిగిన తప్పిదాలు.
తెలంగాణలో 2014 మరియు 2024 లో జరగిన రెండు సమగ్ర కుటుంబ సర్వేల ను విశ్లేషణ చేస్తే అనేక అసక్తి కరమైన తప్పిదాలు తెల్సినాయి.
2014 సర్వే ను trs ప్రభుత్వం 2024 సర్వే ను కాంగ్రెస్ ప్రభుత్వం ఎవరికి వారు తమ రాజకీయ అవసరాల గణాంకాల ను మార్పులు చేర్పులు చేసుకున్నారని తెలిసింది ముఖ్యంగా జనాభా లో అత్యదికంగా ఉన్న బీసీ ల సంఖ్యలో గణనీయమైన మార్పులను చేసుకున్నారని తెలిసింది.
సంఖ్యలు మరియు ఫలితాలను నిశితంగా పరిశీలిస్తే ఈ సర్వేల పద్దతి, ఉద్దేశాలు మరియు పరిణామాల గురించి ముఖ్యమైన ప్రశ్నలు తలెత్తుతాయి.
టీఆర్‌ఎస్ (కేసీఆర్ ) ప్రభుత్వం 2014 సర్వే ప్రకారం జనాభాలో 51%, దాదాపు 1.85 కోట్ల మంది వెనుకబడిన తరగతులకు (బీసీలు) చెందిన వారు ఉన్నారు ఈ సర్వే లో మున్నూరు కాపు కమ్యూనిటీ అతిపెద్ద BC కమ్యూనిటీగా ఉద్భవించింది, జనాభాలో 9% గా 28 నుండి 30 లక్షల వరకు ఉన్నారు,
ముదిరాజ్ కులానికి నాలుగు ఉపకులా లు ముత్రాసి తెనుగు బెస్త గంగ పుత్ర కులాల ను కలిపి 31 లక్షల మంది గా తేల్చారు.యాదవ లు గౌడ్ లు పద్మశాలి లు తదనంతరం స్థానాలు గా చూపించారు .
2024 సర్వే: బీసీ జనాభాలో తగ్గింపు
దీనికి విరుద్ధంగా, 2024లో కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహించిన సర్వే ప్రకారం బీసీ జనాభా 1.64 కోట్లు తగ్గింది. మున్నూరు కాపు సామాజికవర్గం జనాభాను భారీగా 13 లక్షలకు తగ్గించారని, ఉద్దేశ్యపూర్వకంగా తక్కువ చేశారని అయా కుల సంఘాలు ఆరోపణలు చేస్తున్నాయి.
ఈ సర్వేలో ఇతర బీసీ వర్గాల జనాభాలో కూడా మార్పులు చోటుచేసుకున్నాయని, ఇప్పుడు ముదిరాజ్ సామాజికవర్గం తో పాటు తెనుగు బెస్త గంగ పుత్ర కులాల అయిన నాల్గు ఉప కులాలను కలుపుకొని 26 లక్షలు గా అతిపెద్దదిగా చూపగా, యాదవ, గౌడ సామాజికవర్గాలు ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. మున్నూరు కాపు కులాన్ని నాల్గవ స్థానంలో పెట్టా రు.
బీసీ జనాభా తగ్గుదల, ముఖ్యంగా మున్నూరు కాపు సామాజిక వర్గం, ఇతర కులా లు 2024 సర్వే వెనుక ఉన్న పద్దతి మరియు ఉద్దేశాల గురించి ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
చారిత్రాత్మకంగా కేసీఆర్ ను మరియు కాంగ్రెస్ నాయకత్వాన్ని వ్యతిరేకిస్తూ, ఇటీవలి జరిగిన ఎమ్మెల్యే ఎంపీ ఎన్నికల్లో బీజేపీకి మద్దతుగా నిలిచిన మున్నూరు కాపులతో సహా ఇతర నిర్దిష్ట వర్గాలను లక్ష్యంగా చేసుకుని సర్వే రూపొందించినట్లు సంబంధిత వర్గాలు ఆరోపణలు చేస్తున్నాయి.
సర్వే ఫలితాలు రాజకీయ ప్రాతినిధ్యం, సామాజిక సంక్షేమ పథకాలు మరియు సమాజ సంబంధాలపై గణనీయమైన ప్రభావాలను కలిగి ఉంటాయి.
మున్నూరు కాపు కమ్యూనిటీ తగ్గిన జనాభా కారణంగా రాజకీయ ప్రాతినిధ్యం మరియు సంక్షేమ పథకాలు తగ్గడానికి దారితీయవచ్చు, ఇది ఇప్పటికే ఉన్న కులాల అసమతుల్యతలను శాశ్వతంగా కొనసాగించవచ్చు.
2024 సర్వే ప్రకారం ముస్లిం మొత్తం జనాభా 13% ఉండగా అందులో 10% ముస్లింలను బీసీలుగా గుర్తించడం ద్వారా ముస్లిం ఓటర్లను ప్రలోభపెట్టే ప్రయత్నంగా భావించవచ్చు, అయితే ఇది ఇతర హిందూ బీసీ వర్గాల కు తీవ్ర అన్యాయం జరుగ బోతుంది. స్థానిక సంస్థల ఎన్నికల లో ముస్లిం లు ఇతర హిందూ బీసీ వర్గాల తో పోటీ పడతారు. ఇది అనవసరమైన మత ఘర్షణల కు దారతీస్తుంది.అశాంతిని సృష్టిస్తుంది.
జనాభా డేటాను సంక్షేమం కోసం కాకుండా రాజకీయ సాధనంగా ఉపయోగించడం ఆందోళనకరమైన ధోరణి. ఇలాంటి సర్వేలు ప్రజాభిప్రాయాన్ని మార్చేందుకు, విధాన నిర్ణయాలను ప్రభావితం చేయడానికి మరియు సామాజిక అసమానతలను కొనసాగించడానికి ఉపయోగపడతాయి.
2014 మరియు 2024 సర్వేలు ,రాష్ట్ర జనాభా స్వరూపంలో గణనీయమైన మార్పులను వెల్లడిస్తున్నాయి.
అయితే, ఈ సర్వేల యొక్క పద్దతి, ఉద్దేశాలు మరియు చిక్కులు జనాభా డేటాను కేవలం రాజకీయ సాధనంగా ఉపయోగించడం గురించి ముఖ్యమైన ప్రశ్నలను లేవనెత్తాయి.
అన్ని కులాల సంక్షేమం కోసం కాకుండా రాజకీయ ఆధిపత్యం అవసరాల కోసం కులాల సంఖ్యల లో మార్పులు చేర్పులు చేయడం సర్వే లక్షమే దెబ్బతిన్నది.
జనాభా లో అత్యదికంగా ఉన్న బీసీ కులాలలో సంఖ్యను మార్చడం ద్వారా భవిషత్ లో వారి సంక్షేమం రాజకీయ ప్రతినిత్యం పై తీవ్ర మైన ప్రభావం చూపే అవకాశం ఉంది.
రాజకీయ పార్టీలు ఈ సర్వే ఫలితాల ఆధారంగ గా స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎంపీ ఎమ్మెల్యే ఎన్నికల లో ఆయా కులా ల ప్రాతినిథ్యం ను నిర్ణయిస్తే తీవ్ర మైన అన్యాయం జరిగే అవకాశం ఉంటది..