సీతాఫలం ఔషధ ప్రయోజనాలు
- గ్యాస్ సమస్యలు
- ఎముకల బలానికి
- చర్మ సమస్యల పరిష్కారానికి
- గుండె బలానికి
- గ్యాస్ సమస్యలు ఉన్న వారు చలికాలంలో భోజనం తరువాత ఒక సీతాఫలం తింటే గ్యాస్ సమస్యలు తగ్గి జీర్ణశక్తి మెరుగుపడుతుంది.
- ఎముకలు, నరాల బలహీనత ఉన్నవారు ప్రతిరోజు ఉదయం, సాయంత్రం భోజనం తర్వాత ఒక సీతాఫలం తింటే ఎముకలు దృఢంగా మారి, నరాలు, కండరాలు బలంగా తయారవుతాయి. ఈ విధంగా కాల్షియం స్థాయిలు పెరిగి శరీరం ఆరోగ్యంగా ఉంటుంది.
- గుండె బలానికి కూడా సీతాఫలం ఉపయోగపడుతుంది. ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం ఒక సీతాఫలం తినడం గుండెను బలంగా ఉంచుతుంది.
- సీతాఫలం విత్తనాలను బాగా పొడిచిన తర్వాత నువ్వులు నూనెలో వేడి చేసి జుట్టుకు రాసుకుంటే, జుట్టులో వచ్చే పేల సమస్య తగ్గుతుంది.
- సీతాఫలాలు రుచిగా ఉండటంతో ఎక్కువగా తినడం వల్ల కడుపు నొప్పి వచ్చే అవకాశం ఉంటుంది. అందువల్ల, రోజుకు రెండు నుంచి మూడు సీతాఫలాలు తినడం మంచిది. ఎక్కువ మోతాదులో తినడం వల్ల కడుపు నొప్పి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది.