Breaking News

The 15th Libraries of the Carrika Parva

15న తిరుమలలో కార్తీక పర్వ దీపోత్సవం

15న తిరుమలలో కార్తీక పర్వ దీపోత్సవం

తిరుమల, డిసెంబర్ 14, 2024:
తిరుమలలో డిసెంబర్ 15న సాలకట్ల కార్తీక పర్వదీపోత్సవాన్ని టీటీడీ ఘనంగా నిర్వహించనుంది. కార్తీక పౌర్ణమి సందర్భంగా శ్రీవారికి ప్రత్యేక కైంకర్యాలు, నివేదనలు సాయంత్రం పూర్తైన తర్వాత ఈ దీపోత్సవం నిర్వహిస్తారని టీటీడీ అధికారులు తెలిపారు.

నా రాష్ట్రం ఆంధ్ర‌ప్ర‌దేశ్-నా రాజ‌ధాని అమ‌రావ‌తి

దీని భాగంగా శ్రీవారిని మంగళవాయిద్యాలతో ఊరేగింపుగా విమాన ప్రదక్షిణం చేయించి, ఆనంద నిలయంలో హారతులు సమర్పించనున్నారు. ఈ ప్రత్యేక కార్యక్రమం నిర్వహణ దృష్ట్యా డిసెంబర్ 15న సాహస్ర దీపాలంకరణ సేవ, పౌర్ణమి గరుడసేవలను టీటీడీ రద్దు చేసినట్లు ప్రకటించారు.

తిరుమలలో ఈ పర్వదినం భక్తులందరికీ ఆధ్యాత్మిక ఆనందాన్ని అందిస్తుందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేశారు.

పడమర బైపాస్ పై చినకాకాని వద్ద ఫ్లైఓవర్ నిర్మించాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *