అంబుజాలో సంఘీ, పెన్నా సిమెంట్ విలీనం
ఆంధ్రప్రదేశ్‌కు చెందిన పెన్నా సిమెంట్ ఇండస్ట్రీస్ మరియు , సంఘీ ఇండస్ట్రీస్ సంస్థలను తమలో విలీనం చేసుకోనున్నట్లు అదానీ గ్రూప్ ఆధ్వర్యంలో ఉన్న అంబుజా సిమెంట్స్ ప్రకటించింది. ఈ విలీనానికి సంబంధించి రెండు వేర్వేరు ప్రణాళికలను అంబుజా సిమెంట్స్ బోర్డు ఆమోదించింది.
ఈ విలీనాల ద్వారా సంస్థ యొక్క వ్యవస్థాగత పనితీరు మెరుగవుతుందని, అలాగే నియంత్రణ సంబంధిత అవసరాలు సరళతరం అవుతాయని అంబుజా తెలిపింది. సంఘీ ఇండస్ట్రీస్ మరియు పెన్నా సిమెంట్తో విలీన ప్రణాళికలను అంబుజా సిమెంట్ చేపట్టడం ద్వారా సిమెంట్ పరిశ్రమలో మరింతగా విస్తరణ సాధించనుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.