పంజాబ్ రాష్ట్రంలోని శంభు సరిహద్దు నుంచి 101 మంది రైతులతో కూడిన బృందం ఈ రోజు (డిసెంబర్ 6) ఢిల్లీకి మార్చ్ గా బయలుదేరాలని రైతు నాయకుడు స్వరణ్ సింగ్ పంధేర్ తెలిపారు.
రైతులు పంటల మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించడమే కాకుండా, ఇతర సమస్యల పరిష్కారానికి కూడా డిమాండ్ చేస్తున్న దృష్ట్యా, వీరు గత కొన్ని రోజుల నుంచి కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు నిర్వహిస్తున్నారు.
ఈ రైతుల మార్చ్ ను దృష్టిలో పెట్టుకుని, హర్యానాలోని అంబాలా పోలీసులు అలర్ట్ అయ్యారు. సీనియర్ అధికారుల ఆధ్వర్యంలో పలు పోలీసు బృందాలను సరిహద్దు ప్రాంతాల్లో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో, పంజాబ్‌లోని మన్సా నుంచి బఠిండా వైపు 50 వాహనాలతో వెళ్ళిపోతున్న 300 మందికి పైగా రైతులను పోలీసులు అడ్డుకున్నారు. దీనితో కొన్ని ప్రాంతాల్లో ఘర్షణ చోటుచేసుకుంది. ఈ గొడవలో ముగ్గురు పోలీసులకు గాయాలయ్యాయి.
అంతే కాకుండా, ప్రతిపాదిత గ్యాస్ పైప్‌లైను భూసేకరణ నష్టపరిహారం చాలా తక్కువగా ఉన్నందుకు రైతులు నిరసన వ్యక్తం చేస్తున్నారు.