వాసిరెడ్డి పద్మ త్వరలో టీడీపీలో చేరనున్న అవకాశం
ఈ నెల 9వ తేదీన టీడీపీ నాయకుడు నారా లోకేష్ సమక్షంలో వాసిరెడ్డి పద్మ టీడీపీ గూటికి చేరనున్నట్లు సమాచారం. ఇటీవల ఆమె వైసీపీకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.
ఇటీవల ఎంపీ కేశినేని చిన్నిని మర్యాదపూర్వకంగా కలిసిన వాసిరెడ్డి పద్మ, టీడీపీ తీర్థం పుచ్చుకునేందుకు సిద్ధమవుతున్నట్లు రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
ఈ పరిణామం తెలుగు రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. పార్టీ మార్పుతో వాసిరెడ్డి పద్మ భవిష్యత్తు రాజకీయ ప్రయాణం ఎలా ఉండబోతుందో చూడాలి.