బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడింది. ఇది క్రమంగా పశ్చిమవాయువ్య దిశగా కదులుతుండగా, వాతావరణ శాఖ తెలిపిన మేరకు, వచ్చే 24 గంటల్లో ఈ అల్పపీడనం మరింత బలపడే అవకాశం ఉందని పేర్కొంది. ఈనెల 11 నాటికి శ్రీలంక-తమిళనాడు తీరానికి చేరుకునే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. దీని ప్రభావంతో ఉత్తరాంధ్ర జిల్లాల సహా ఉమ్మడి తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కృష్ణా జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వెల్లడించింది.
