Breaking News

Opposition status will be decided by the people - Deputy CM

ప్రతిపక్ష హోదా ప్రజలే నిర్ణయిస్తారు – డిప్యూటీ సీఎం

|| Opposition status will be decided by the people – Deputy CM ||: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్

అమరావతి: “ప్రతిపక్ష హోదా అడిగితే ఇచ్చేది కాదు, ప్రజలు ఇస్తేనే వస్తుంది” అని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. అత్యధిక మెజారిటీతో రెండో స్థానంలో ఉన్న పార్టీకి మాత్రమే ప్రతిపక్ష హోదా లభిస్తుందని, ఈ విషయంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YSRCP) హుందాగా ప్రవర్తించాల్సిన అవసరం ఉందని సూచించారు.

“సభను అడ్డుకోవడం సరికాదు” – పవన్ కల్యాణ్

అసెంబ్లీ సమావేశాల సందర్భంగా మీడియా పాయింట్ వద్ద మాట్లాడిన పవన్

Tomorrow is a holiday
రేపు, ఎల్లుండి సెలవు
  • “వైసీపీ సభ్యులు ప్రతిపక్ష హోదా కోరుతున్నారు. కానీ జనసేన రెండో అతిపెద్ద పార్టీ. మాకంటే ఒక్క సీటు ఎక్కువ వచ్చినా వారికే ఆ హోదా దక్కేది.”
  • “ప్రతిపక్ష హోదా ఇవ్వకపోతే సభను అడ్డుకుంటామని చెప్పడం తగదు.”
  • “ప్రజలు ఇచ్చిన 11 సీట్లను గౌరవించి అసెంబ్లీకి రండి. సమస్యలు, ప్రభుత్వ లోటుపాట్లు స్పష్టం చేయండి.”
  • “సభలో సంఖ్యను బట్టి స్పీకర్ సమయం కేటాయిస్తారు. కానీ సభ ప్రారంభమైన వెంటనే నిరసన ప్రదర్శించడం వైసీపీ దిగజారుడుతనానికి నిదర్శనం.”

“ఫిక్స్ అయిపోండి… ప్రతిపక్ష హోదా రాదు”

పవన్ కల్యాణ్ వైసీపీకి స్పష్టమైన సందేశం ఇస్తూ…

  • “ఈ ఐదేళ్లూ వైసీపీకి ప్రతిపక్ష హోదా రాదు. వాళ్లను అవమానించాలనో, తగ్గించాలనో కాదు. నిబంధనలు అనుసరించాల్సిందే.”
  • “వైసీపీ సభ్యులు దాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రవర్తించాలి.”
  • “ఓట్ల శాతాన్ని దృష్టిలో పెడితే వారు జర్మనీ వెళ్లిపోవాలి” అంటూ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు.

వైసీపీ తీరుపై మండిపడ్డ పవన్

పవన్ కల్యాణ్ చేసిన ఈ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. అసెంబ్లీలో వైసీపీ తీరును తప్పుబట్టిన పవన్, అసెంబ్లీలో నిర్మాణాత్మక చర్చకు ఆస్కారం లేకుండా అడ్డుకోవడం ప్రజాస్వామ్య విరుద్ధమని తేల్చిచెప్పారు.

Reconstruction of the state is our goal: CM Chandrababu
రాష్ట్ర పునర్నిర్మాణం మా లక్ష్యం: సీఎం చంద్రబాబు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *