ఎంపీ వద్దిరాజు ఎమ్మెల్సీ కవితకు బీఆర్ఎస్ శ్రేణులు ఘన స్వాగతం
Date 24/02/2025
ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మహబూబాబాద్, భూపాలపల్లి జిల్లాలలో పలు కార్యక్రమాలలో పాల్గొనేందుకు గాను సోమవారం ఉదయం హైదరాబాద్ నుంచి బయలుదేరగా బీఆర్ఎస్ శ్రేణులు పలుచోట్ల ఆపి ఘన స్వాగతం పలికారు.ఎంపీ రవిచంద్ర ఎమ్మెల్సీలు కవిత,సత్యవతి రాథోడ్,మాజీ ఎంపీ మాలోతు కవిత తదితర ప్రముఖులతో కలిసి పర్యటనకు బయలుదేరగా మొదట చౌటుప్పల్ మండలం ఖైరతాపూర్ వద్ద పార్టీ నాయకులు స్వాగతం చెప్పారు.అక్కడ వారు అల్పాహారం తీసుకుని తిరిగి బయలుదేరగా శాలిగౌరారం మండలం పెర్క కొండారం వద్ద బీఆర్ఎస్ విద్యార్థి,యువజన విభాగం నాయకులు పుష్పగుచ్ఛాలిచ్చి వారికి స్వాగతం పలికారు.ఎంపీ రవిచంద్ర, ఎమ్మెల్సీలు కవిత, సత్యవతి, మాజీ ఎంపీ కవితలకు సూర్యాపేట జిల్లా మద్దిరాల వద్ద మాజీ మంత్రి రెడ్యానాయక్ ఆధ్వర్యాన బీఆర్ఎస్ శ్రేణులు స్వాగతం చెప్పారు.మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండలం రామానుజపురం సమీపాన ఎమ్మెల్సీ తక్కళ్లపల్లి రవీందర్ రావు నాయకత్వంలో మహిళలు హారతి పట్టి ఎమ్మెల్సీ కవితకు ఆత్మీయ స్వాగతం పలికారు, పార్టీ నాయకులు గజమాల, శాలువాలతో సత్కరించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత ఎంపీ రవిచంద్ర, శాసనమండలి సభ్యులు రవీందర్ రావు, సత్యవతి, మాజీ మంత్రి రెడ్యానాయక్, మాజీ ఎంపీ కవితలతో కలిసి రెండు మొక్కలు నాటారు.అటుతర్వాత కల్వకుంట్ల కవిత ఆర్థిక సహాయంతో రామానుజపురంలో చిరకాల అభిమాని చిర్రా సతీష్ ఏర్పాటు చేసిన ఇంటర్ నెట్,జీరాక్స్ సెంటర్ ను ఎంపీ వద్దిరాజు, ఎమ్మెల్సీలు రవీందర్ రావు,సత్యవతి, మాజీ మంత్రి రెడ్యానాయక్, మాజీ ఎంపీ కవిత, మహబూబాబాద్ జేడ్పీ మాజీ ఛైర్ పర్సన్ ఆంగోతు బింధులతో కలిసి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు.ఈ సందర్భంగా రామానుజపురం వాసులు ఎమ్మెల్సీ కవిత, ఎంపీ రవిచంద్ర తదితర ప్రముఖులకు పెద్ద పెట్టున నినాదాలిస్తూ ఘన స్వాగతం పలికి పూలమాలలు, శాలువాలతో సత్కరించారు.


