Breaking News

Group changes with the Jamili election

జమిలి ఎన్నికలతో సమూల మార్పులు: రాంనాథ్ కోవింద్ వ్యాఖ్యలు

జమిలి ఎన్నికలు దేశంలో సమూల మార్పులకు దారితీస్తాయని కేంద్రం నియమించిన కమిటీ చైర్మన్ మరియు భారత మాజీ రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ అన్నారు. జమిలి ఎన్నికల నిర్వహణ వల్ల దేశ ఆర్థిక వృద్ధి రేటు (జీడీపీ) 1 శాతం నుంచి 1.5 శాతం వరకు పెరుగుతుందని, ఆర్థిక నిపుణుల అభిప్రాయాలను ఉటంకించారు.

తెలంగాణకు అదనపు నిధుల కోసం కేంద్రాన్ని కలిసిన భట్టి

లోక్‌సభ, అన్ని రాష్ట్ర శాసనసభల ఎన్నికలను ఒకేసారి నిర్వహించాలనే ప్రతిపాదన ఏ ఒక్క పార్టీ అభిప్రాయమో కాదని, ఇది ప్రజలకే చెందిన కోరిక అని కోవింద్ తెలిపారు. అయితే, ఈ ఆలోచన అమలు చేయడానికి కేంద్ర ప్రభుత్వం అన్ని రాజకీయ పార్టీల ఆమోదం పొందాలని సూచించారు.

గత సెప్టెంబరులో జమిలి ఎన్నికల ప్రతిపాదనకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ ప్రతిపాదన ప్రకారం, లోక్‌సభ, రాష్ట్ర శాసనసభలకు ఒకేసారి ఎన్నికలు జరగాలి. అనంతరం 100 రోజుల వ్యవధిలో మున్సిపాలిటీలు, పంచాయతీ ఎన్నికలను పూర్తి చేయాల్సి ఉంటుంది.

కులగణనపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు

జమిలి ఎన్నికలు దేశ ప్రజల సమగ్ర అభివృద్ధికి దోహదం చేస్తాయని విశ్వాసం వ్యక్తం చేస్తూ, కోవింద్‌ కీలక వ్యాఖ్యలు చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *