టెలికాం టారిఫ్ వోచర్లపై ట్రాయ్ కీలక మార్పులు
టెలికాం ఆపరేటర్ల టారిఫ్ వోచర్ల నిబంధనల్లో ట్రాయ్ (టెలికాం నియంత్రణ మండలి) కీలక మార్పులు చేసింది. డేటా అవసరం లేని వినియోగదారులకు ప్రత్యేక వాయిస్ మరియు ఎస్‌ఎంఎస్ రీచార్జ్ వోచర్లు జారీ చేయాలని కంపెనీలను ఆదేశించింది.
ఇందులో భాగంగా, ప్రత్యేక రీచార్జ్ కూపన్ల గడువును 90 రోజుల నుంచి 365 రోజులకు పెంచింది. ఇకపై ప్రతి టెలికాం ఆపరేటర్ 365 రోజుల చెల్లుబాటు కలిగిన కనీసం ఒక ప్రత్యేక టారిఫ్ వోచర్‌ను తప్పనిసరిగా అందించాల్సి ఉంటుంది.
వాయిస్, ఎస్‌ఎంఎస్ అవసరాలు మాత్రమే ఉన్న వినియోగదారులు కూడా డేటా ప్యాకేజ్లతో బలవంతంగా రీచార్జ్ చేయాల్సి వస్తోందని చందాదారుల నుంచి వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో ట్రాయ్ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ మార్పులు వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా టారిఫ్ ప్లాన్ల అందుబాటును మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషించనున్నాయి.