పుష్ప 2 విషాదం: సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో ప్రధాన నిందితుడి అరెస్టు
హైదరాబాద్‌లో సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనకు సంబంధించి ప్రధాన నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటనలో అల్లు అర్జున్ బౌన్సర్ ఆంటోనీని అదుపులోకి తీసుకున్నారు.
పోలీసుల దర్యాప్తు ప్రకారం, ఈ తొక్కిసలాటకు ఆంటోనీ ప్రధాన కారణమని నిర్ధారించారు. అల్లు అర్జున్ బౌన్సర్ల టీమ్‌లో ఆంటోనీ ఆర్గనైజర్‌గా పనిచేస్తున్నారు. ఈ సంఘటన నేపథ్యంలో చిక్కడపల్లి పోలీస్ స్టేషన్‌లో హీరో అల్లు అర్జున్‌ను సుమారు రెండున్నర గంటల పాటు విచారించినట్లు సమాచారం.
పోలీసులు ఘటనపై మరింత లోతుగా దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఈ ఘటన పట్ల అభిమానులు దిగ్భ్రాంతికి గురవుతుండగా, కేసు పరిణామాలపై అందరి చూపు ఉంది.