జనవరి 8న ‘జమిలి ఎన్నికల బిల్లు’పై జేఏసీ మీటింగ్
‘వన్ నేషన్, వన్ ఎలక్షన్’ బిల్లుపై ఏర్పాటైన జాయింట్ పార్లమెంటరీ కమిటీ (జేఏసీ) జనవరి 8న తొలిసారి సమావేశం కానుంది.
కమిటీ ఛైర్పర్సన్‌తో పాటు సభ్యులందరూ ఈ కీలక సమావేశానికి హాజరవుతారని కమిటీ జాయింట్ సెక్రటరీ గుండా శ్రీనివాసులు మీడియాకు వెల్లడించారు.
జనవరి 8న ఉదయం 11 గంటలకు ఈ సమావేశం ప్రారంభం కానుందని, ఇందులో బిల్లుపై చర్చించి ముందుచర్యలు నిర్ణయిస్తారని తెలిపారు. ఈ సమావేశంపై అన్ని రాజకీయ పార్టీలు మరియు ప్రజాసంఘాలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి.