విద్యాశాఖ సెక్రెటరీగా ఐఏఎస్ అధికారి యోగితా రాణా నియమితు
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము విద్యాశాఖ సెక్రెటరీగా సీనియర్ ఐఏఎస్ అధికారి యోగితా రాణాను నియమించింది. 2003 ఐఏఎస్ బ్యాచ్‌కు చెందిన యోగితా రాణా ప్రస్తుతం సాంఘిక సంక్షేమ శాఖ కార్యదర్శిగా పనిచేస్తున్నారు.
మునుపటి విద్యాశాఖ సెక్రెటరీ బుర్రా వెంకటేశంను 2023 డిసెంబర్‌లో టీజీపీఎస్సీ చైర్మన్‌గా నియమించిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకోబడింది. దీంతో, ఎన్. శ్రీధర్‌కు విద్యాశాఖ బాధ్యతలు అప్పగించబడ్డాయి. తాజాగా యోగితా రాణాను సెక్రెటరీగా నియమించడంతో, ఎన్. శ్రీధర్‌ను ఆ బాధ్యతల నుండి రిలీవ్ చేసి, గనుల శాఖ కార్యదర్శిగా అదనపు బాధ్యతలు అప్పగించారు.
ఇదే సమయంలో, 2006 బ్యాచ్‌కు చెందిన కే. సురేంద్ర మోహన్‌ను రవాణా శాఖ కమిషనర్‌గా నియమిస్తూ, రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
యోగితా రాణా ప్రొఫైల్:
2003 ఐఏఎస్ బ్యాచ్‌కు చెందిన యోగితా రాణా 2002లో సివిల్ సర్వీసెస్ పరీక్షలో మూడో ప్రయత్నంలో ఐఆర్‌టీఈఎస్‌కు ఎంపికయ్యారు. 2003లో నాల్గవ ప్రయత్నంలో ఐఏఎస్‌కు ఎంపికైన ఆమె, మొదటి విధిగా విశాఖ జిల్లాలో శిక్షణ తీసుకున్నారు. భద్రాచలంలో సబ్ కలెక్టర్‌గా, రంపచోడవరం ఐటీడీఏ పీఓగా పనిచేసారు.
అంతేగాక, యూఎన్‌డీపీలో మూడున్నర సంవత్సరాల పాటు బాధ్యతలు నిర్వహించారు. 2017లో నిజామాబాద్ జిల్లా కలెక్టర్‌గా పనిచేస్తూ, ‘ఈ-నామ్’ కార్యక్రమంలో జాతీయ అవార్డు అందుకున్నారు.