Breaking News

YS Jaganmohan Reddy Jagan "Trust is important in politics" – Jagan

తిరుమల స్విమ్స్ కు జగన్..బాధితులను పరామర్శ

మాజీ సీఎం జగన్ తిరుమలకి బయలుదేరి, స్విమ్స్ ఆస్పత్రి పరామర్శ: అధికారులు, ప్రజల మధ్య ఉత్కంఠ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ సీఎం, వైకీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఈ రోజు మధ్యాహ్నం 2 గంటలకు తిరుమల వెళ్లనున్నారు. బుధవారం రాత్రి తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనం టోకెన్ల జారీ సందర్భంగా జరిగిన తొక్కిసలాట (Stampede) ఘటనలో ఆరుగురు మరణించిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై ఇప్పటికే తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన మాజీ సీఎం జగన్ నేడు స్విమ్స్ ఆస్పత్రి (Swims Hospital)కి వెళ్లి చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించనున్నారు.

Tomorrow is a holiday
రేపు, ఎల్లుండి సెలవు

వైకీపీ శ్రేణులు ఇప్పటికే ముందస్తుగా తిరుపతికి చేరుకుంటున్నారు. అయితే, జగన్ స్విమ్స్ ఆస్పత్రి పరామర్శ చేయడానికి పోలీసులు అనుమతి ఇస్తారా లేదా అనేది అనిశ్చితంగా మారింది. ఎందుకంటే, తొక్కిసలాటలో గాయపడిన వారి కుటుంబ సభ్యులు ఇప్పటికే ఆస్పత్రి పరిసరాల్లో భారీగా కూడా జనం సమగమించారు.

ఈ క్రమంలో, మాజీ సీఎం జగన్ వచ్చిన తర్వాత పరిస్థితులు అదుపు తప్పే అవకాశం ఉన్నందున, పోలీసులు తీసుకునే చర్యపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. గత కాలంలో జగన్, రాష్ట్రంలో జరుగుతున్న ప్రతీ సంఘటనపై స్పందిస్తూ, నేరుగా బాధిత కుటుంబాలను పరామర్శించి, రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ ఉంటున్నారు.

Reconstruction of the state is our goal: CM Chandrababu
రాష్ట్ర పునర్నిర్మాణం మా లక్ష్యం: సీఎం చంద్రబాబు

వైకీపీ అధినేత జగన్ తిరుమలలో జరిగే ఈ కార్యక్రమంలో పాల్గొనడం, పరిస్థితిని అంచనా వేసి, పరిష్కారం పొందేందుకు ఆ ప్రాంతంలో ఉన్న అధికారుల నిర్ణయాలు కీలకంగా మారనున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *