డ్రగ్స్ కేసులో నటుడు మన్సూర్ అలీ ఖాన్ కుమారుడు అరెస్ట్
నటుడు మన్సూర్ అలీ ఖాన్ కుమారుడు అలీ ఖాన్ తుగ్లక్ డ్రగ్స్ కేసులో అరెస్టయ్యారు. అతను డ్రగ్స్ అమ్మినట్లు, అలాగే వాడినట్లు వైద్య పరీక్షల్లో పోలీసులు నిర్ధారించారు. గత వారం కార్తికేయన్ అనే వ్యక్తితో సహా 10 మంది కాలేజీ విద్యార్థులను డ్రగ్స్ అమ్మకాలకు సంబంధించి జె.జె.నగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. విచారణలో, కార్తికేయన్ ద్వారా అలీ ఖాన్ ఆన్లైన్లో డ్రగ్స్ కొనుగోలు చేసి, అమ్మారని మరియు వాడారని తేలింది. దీంతో ఆయన్ను అరెస్ట్ చేశారు.