కొమురవెళ్లి మల్లన్న హుండీ లెక్కింపు: రూ.81.68 లక్షల ఆదాయం
డిసెంబర్ 14, 2024:
ప్రముఖ పుణ్యక్షేత్రం కొమురవెళ్లి శ్రీ మల్లికార్జున స్వామి హుండీ ఆదాయాన్ని ఆలయ అధికారులు శుక్రవారం లెక్కించారు. ఈ లెక్కింపులో 73 రోజులకు గాను రూ. 81,68,044 రూపాయల ఆదాయం వచ్చినట్లు వెల్లడించారు.
అదనంగా,
- 146 గ్రాముల మిశ్రమ బంగారం,
- 5 కిలోల 200 గ్రాముల మిశ్రమ వెండి,
- 26 విదేశీ నోట్లు,
- 550 కిలోల మిశ్రమ బియ్యం స్వామి హుండీ ద్వారా అందినట్టు ఆలయ అధికారులు తెలిపారు.
భక్తుల అంకితభావంతో సేకరించిన ఈ విరాళాలు ఆలయ అభివృద్ధి, భక్తుల సౌకర్యాల కోసం వినియోగించనున్నట్లు ఆలయ అధికారులు పేర్కొన్నారు.