Breaking News

Extension of visa exemption until 2026

వీసా మినహాయింపును 2026 వరకు పొడిగింపు

మలేషియా భారతీయ పౌరులకు వీసా మినహాయింపును 2026 వరకు పొడిగించింది

మలేషియా భారతీయ పౌరులకు వీసా మినహాయింపును 2026 డిసెంబర్ 31 వరకు పొడిగించింది.

హోం మంత్రిత్వ శాఖ సెక్రటరీ జనరల్ దాతుక్ అవాంగ్ అలిక్ జెమన్ శుక్రవారం ఈ మేరకు ప్రకటన చేశారు. ఇది మలేషియా 2025 ఆసియాన్ ఛైర్మన్‌షిప్ మరియు 2026 విజిట్ మలేషియా ఇయర్ ఏర్పాట్లలో భాగంగా తీసుకున్న నిర్ణయమని ఆయన చెప్పారు.

ఇరాన్‌పై ఒత్తిడి: ట్రంప్ యురేనియం స్వాధీనం ఆలోచన

అలాగే, చైనా జాతీయులకు కూడా ఇదే విధమైన వీసా మినహాయింపు పొడిగించామని తెలిపారు.

డిసెంబర్ 1, 2023 నుండి అమలులో ఉన్న ఈ వీసా సరళీకరణ ప్రణాళిక దేశ ఆర్థిక మరియు పర్యాటక రంగాలను పెంచడం మరియు జాతీయ భద్రతను కాపాడడాన్ని లక్ష్యంగా పెట్టుకుని చేపడుతున్నారని అవాంగ్ అలిక్ పేర్కొన్నారు.

ఈ చొరవ ద్వారా భారతదేశం మరియు చైనా జాతీయులకు 30 రోజుల వీసా మినహాయింపు అందిస్తున్నట్లు తెలిపారు.

ట్రంప్ పాలనపై భారీ ఆగ్రహం.. అమెరికా వీధుల్లో జనసంద్రం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *